
బోధన్,వెలుగు : సాలూర మండలంలోని మంజీర నదిపై ఉన్నా ఎత్తిపోతల పథకాన్ని నిర్వహణ కమిటి సభ్యులు, రైతులు లిప్ట్ ప్రారంభించారు. ఈసందర్భంగా లిప్ట్ నిర్వహణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. లిప్ట్ వద్ద ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో స్థానిక ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డికి చెప్పామని
ఆయన చొరవ తీసుకోవడంతో రిపేర్లు చేయించి, లిప్ట్ ప్రారంభించినట్లు తెలిపారు. లిప్ట్ కోసం సహకరించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.