ఏపీకి మరోసారి వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీకి మరోసారి వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీలోని చిత్తూరు, నెల్లురు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది వాతావరణ శాఖ .   నవంబర్ 29  వరకు  దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం తెలిపింది. దీని ఫలితంగా  తిరుపతి, నెల్లూరులో 13 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఈ నెల 28, 29 తేదీల్లో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ, యానాంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.