రాగల 3 రోజులకు వాతావరణ సూచన

రాగల 3 రోజులకు వాతావరణ సూచన

రాష్ట్రంలో మరోసారి వానలు దంచికొట్టే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదివారం  పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగిందని..సోమవారం కూడా  ఉపరితల ఆవర్తనం అక్కడే కొనసాగుతూ సముద్రం మట్టానికి 4.5 కిలో  మీటర్ల ఎత్తు వరకు వ్యాపించిందని వాతావరణ శాఖ పేర్కొంది. క్రింది స్థాయిలోని గాలులు.. ముఖ్యంగా ఉత్తర, వాయువ్య దిశల నుండి తెలంగాణ వైపునకు వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో..రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక బుధవారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.