ఆదిలాబాద్లో పత్తి కనీస మద్దతు ధర రూ.7850

ఆదిలాబాద్లో పత్తి కనీస మద్దతు ధర రూ.7850

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు కనీస మద్దతు ధరకు నోచుకోవడం లేదు. రకరకాల షరతులు పెడుతూ వ్యాపారులు ధర తగ్గించి కొంటున్నారని రైతులు వాపోతున్నారు. ప్రశ్నించే వారు లేరన్నట్లు రోజు రోజుకూ ధర తగ్గిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీన క్వింటం పత్తికి కనీస మద్దతు ధర 8,300 రూపాయలు పలుకగా.. ఇవాళ పత్తి కనీస మద్దతు ధర క్వింటాలుకి రూ. 7850కు తగ్గించారు. 

కేవలం వారం రోజుల్లో క్వింటాలుకి రూ.500 తగ్గించారని రైతులు ఆరోపించారు. రైతులు మార్కెట్ కు తెచ్చిన పత్తి పంటలో ఏమాత్రం క్వాలిటీ లేదని సాకులు చెబుతున్నారని.. తేమశాతం 8 నుండి 12శాతం వరకు మాత్రమే ఉన్న పత్తిని కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.