కనీస వేతనం రూ.21 వేలు ఇయ్యాలె

V6 Velugu Posted on Nov 25, 2021

  • సికింద్రాబాద్ డీఎంహెచ్ ఆఫీసు ముందు ఆశావర్కర్ల ఆందోళన

సికింద్రాబాద్, వెలుగు: జీతాలు పెంచాలని పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు సీఐటీయూ నాయకులతో కలిసి బుధవారం సికింద్రాబాద్​లోని డీఎంహెచ్ వో ఆఫీసు ముందు ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. కరోనా టైమ్​లో డాక్టర్లు, సిబ్బందితో సమానంగా ఆశా వర్కర్లు పేషెంట్లకు సేవలు అందించారన్నారు. రోజుకి 8 గంటలకు పైగా పనిచేస్తున్నా.. వీరికి జీతం తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం సిటీలో 2 వేలకు పైగా ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని, రోజు రోజుకి వారికి  పనిభారం ఎక్కువవుతున్నా జీతాలు పెరగడం లేదన్నారు. ఆశా వర్కర్లకు నెలకు  కనీస వేతనం  రూ.21వేలు ఇవ్వడంతో పాటు టీఏ, డీఏలు,  వారాంతపు సెలవులు, పీఆర్​సీని  అమలుచేయాలన్నారు.

Tagged secundrabad, dmho, aasha workers, citu, minimum wage

Latest Videos

Subscribe Now

More News