జ్వరం రాకుండా జాగ్రత్తపడండి

జ్వరం రాకుండా జాగ్రత్తపడండి

హైదరాబాద్,వెలుగు: కరోనాతో పాటు వైరల్ ఫీవర్ కు ట్రీట్మెంట్ చేసేలా అన్ని ఆస్పత్రుల్లో బెడ్లు, మెడిసిన్స్, డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యం లో డయేరియా,మలేరియా, చికున్గున్యా, డెంగీనే కాకుండా వైరల్ ఫీవర్ వల్లజనం ఇబ్బంది పడే
అవకాశంఉందని, జ్వరంకేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, భారీ వర్షాల వల్లవచ్చే అంటు వ్యాధులను అరికట్టడంపై వైద్య శాఖ ఉన్న తాధికారులతో బుధవారం ఈటల సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ శాఖలతో సమన్వయం చేసుకొని నివారణ చర్యలు చే పట్టాలని ఆయన సూచించారు. వర్షాలు ఎక్కువ కురుస్తున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టి, నివారణ చర్యలు చేపట్టాలని ప్రజాఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ ను ఆదేశించారు. ఉస్మానియా, నిమ్స్.. నాన్ కోవిడ్ హాస్పిటల్స్‌గా ఉన్నాయని, అక్కడ అన్ని రకాల జబ్బులకు ట్రీట్మెంట్ అందేలా చూడాలన్నారు. అన్ని రకాల జబ్బులకు ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రామస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు రోజువారీ సర్వే చేయాలన్నారు.

రాష్ట్రంలో కరోనా దోపిడిపై కేంద్రం సీరియస్