డ్రైనేజీలో గల్లంతైన  వ్యక్తి.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ రజనీకాంత్‌గా గుర్తింపు

డ్రైనేజీలో గల్లంతైన  వ్యక్తి.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ రజనీకాంత్‌గా గుర్తింపు

శనివారం రాత్రి  మణికొండ  డ్రైనేజీలో  గల్లంతైన  వ్యక్తి  గోపిశెట్టి రజనీకాంత్ గా  గుర్తించారు. ఘటనాస్థలానికి  50 మీటర్ల దూరంలోనే  అతడి ఇల్లు ఉందని చెబుతున్నారు. షాద్ నగర్ లోని నోవా గ్రీన్ కంపెనీలో రజనీకాంత్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మణికొండలో గల్లంతైన వ్యక్తి కోసం రెస్క్యూ కొనసాగుతోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి రజనీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనా జరిగిన ప్రాంతాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు. ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు సబిత. ఘటన జరగడం దురదృష్టకరమన్నారు.

శనివారం సాయంత్రం భారీ వర్షం పడటంతో హైదరాబాద్ మణికొండలో రజనీకాంత్ వరద నీటిలో కొట్టుకుపోయాడు. గోల్డెన్ టెంపుల్ దగ్గర రోడ్డు దాటుతున్న రజనీకాంత్ డ్రైనేజ్ లైన్ గుంతలో పడ్డాడు. గుంత ఉందని చెబుతున్నా కూడా వర్షం శబ్దంతో అతడికి వినపడలేదు. వర్షపు నీళ్లలో నడుచుకుంటూ వెళ్తూ.. డ్రైనేజీ కాలువలో పడ్డాడు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు.. డ్రైనేజీ పైపు లైన్ల కోసం తవ్విన గుంతలో పడిపోయాడు. GHMC, DRF సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని.. గల్లంతైన రజినీకాంత్ కోసం వెతుకుతున్నారు. మున్సిపల్  అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి గల్లంతయ్యాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.