
టైటిల్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం నాని నటిస్తున్న ‘అంటే.. సుందరానికీ’. నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో ఆమెకిదే తొలి చిత్రం. ‘బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలు టీజర్ వరకు ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకుంటున్న టీమ్, తాజాగా మరో కొత్త అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 9న ఉదయం 11.07 నిమిషాలకు ఓ లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ‘పంచెకట్టు’ అనే పాట విడుదలయ్యింది. రెండో పాటగా ‘ఎంత చిత్రం’ అనే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నారు. వివేక్ సాగర్ ట్యూన్‌కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. అనురాగ్ కులకర్ణి, కీర్తన పాడారు. ఈ పాటకి సంబంధించి ఓ స్టిల్‌ను కూడా విడుదల చేశారు. బస్సులో నజ్రియా భుజాలపై నాని తల వాల్చుతుంటే, తన చేతిని అడ్డుపెట్టి నవ్వుతూ ఆపుతోందామె. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది.