నువ్వు.. నా వెన్నెల

నువ్వు.. నా వెన్నెల

ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా శశికాంత్ దర్శకత్వంలో కె.వి.శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘టాప్ గేర్’. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి శుక్రవారం ఓ పాటను రిలీజ్ చేశారు. ‘వెన్నెల వెన్నెల.. నువ్వు నా వెన్నెల.  దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా.. నిండుగా నువ్వుగా పండెనే నా కల’ అంటూ సాగిన మెలోడీ సాంగ్‌‌లో ఆది, రియా జంట ఆకట్టుకుంది. హర్ష వర్ధన్ రామేశ్వర్ కంపోజ్ చేసిన పాటకి రామజోగయ్య శాస్త్రి అందమైన లిరిక్స్ రాశారు. సిద్ శ్రీరామ్ వాయిస్‌‌తో పాటకు హైప్ రావడంతో పాటు యూత్‌‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది.   బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ 30న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.