
లాయర్ దంపతుల హత్య పక్కా ప్లాన్ ప్రాన్ ప్రకారం చేసిన హత్యన్నారు బీజేపీ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పోలీస్ వాళ్లని.. పర్సనల్ పనులకు వాడుకుంటున్నారని ఆరోపించారు. వామన్ రావు దంపతుల హత్యలను ఖండిస్తూ.... ఇందిరా పార్క్ దగ్గర న్యాయవాదుల ధర్నాకు సంఘీభావం తెలిపారు బిజేపీ నేతలు వివేక్ వెంకటస్వామి, పేరాల చంద్రశేఖర్ రావు, రామచందరావ్ రావు. పార్టీలకు సంబంధం లేకుండా... ఈ హత్యపై విచారణ జరిపించాలన్నారు. వామనరావు హత్యపై సీబీఐ ఎంక్వైరీ జరగాలని.. దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు బీజేపీ నేతలు.