అంతుచిక్కని ట్విస్ట్‌లు టర్న్‌లు: ఓటీటీ ట్రెండింగ్‌లో టీనేజీ అమ్మాయి మర్డర్‌‌‌‌‌‌‌‌.. ఫోన్ పక్కన పెట్టేలా చేస్తుంది ఈ కేసు

అంతుచిక్కని ట్విస్ట్‌లు టర్న్‌లు: ఓటీటీ ట్రెండింగ్‌లో టీనేజీ అమ్మాయి మర్డర్‌‌‌‌‌‌‌‌.. ఫోన్ పక్కన పెట్టేలా చేస్తుంది ఈ కేసు

ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. అదే సెర్చ్: ది నైనా మర్డర్ కేస్. ఈ సిరీస్ అక్టోబర్ 10 నుంచి జియో హాట్‌‌‌‌స్టార్‌లో స్ట్రీమింగ్కి అవుతోంది. మొత్తం 6 ఎపిసోడ్స్తో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. చూపు తిప్పుకోకుండా చేస్తున్న ఈ సీరీస్ హాట్ స్టార్లో టాప్ ట్రెండింగ్లో దూసుకెళ్తోంది. రోహన్ సిప్పీ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో కొంకణ సేన్ శర్మ, సూర్య శర్మ, శివ పండిట్, శ్రద్ధా దాస్, ఇరావతి హర్షే కీలక పాత్రలు పోషించారు. 

అయితే, గత మూడు వారాలుగా క్రైమ్ థ్రిల్లర్స్ లేకుండా ఓటీటీ బోసిపోయింది. ఈ క్రమంలో వచ్చిన నైనా మర్డర్ కేస్, మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో వచ్చి కట్టిపడేస్తుంది. ఇంకా చెప్పాలంటే.. చూసే ఆడియన్స్ని ఫోన్ పక్కన పెట్టేలా చేస్తుంది సిరీస్. షార్ట్గా కథ చెప్పాలంటే.. టీనేజీ అమ్మాయి దారుణ హత్య.. ఎంతో మంది అనుమానితులు.. అంతుచిక్కని కోణాలు.. ట్విస్ట్‌లు టర్న్‌లు. ఈ దర్యాప్తులో భాగమయ్యే.. ఏసీపీ సంయుక్త దాస్. ఆ హత్య కేసును తవ్వే కొద్దీ ఒక్కొక్కరు అనుమానితులు పుట్టుకొచ్చే విధానం సిరీస్ను టాప్లో ఉండేలా చేస్తోంది. 

కథేంటంటే:

సంయుక్త దాస్ ( కొంకణ సేన్ శర్మ) ముంబై క్రైమ్ బ్రాంచ్‌‌‌‌లో ఏసీపీగా పనిచేస్తుంటుంది. ఉద్యోగరీత్యా ఎప్పుడూ బిజీగా ఉండే ఆమెకు కుటుంబంతో సరదాగా గడపడానికి టైం దొరకదు. దాంతో అహ్మదాబాద్‌‌‌‌ సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైం డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కి ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేయించుకుంటుంది. కానీ.. ఆమె రిలీవ్‌‌‌‌ అవుతున్న రోజే సిటీలో నైనా అనే అమ్మాయి మర్డర్‌‌‌‌‌‌‌‌ జరుగుతుంది. దాంతో పై ఆఫీసర్లు మరో రెండు రోజులు ముంబైలోనే ఉండి, ఆ కేసుని దర్యాప్తు చేయాలని చెప్తారు.

ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన సంయుక్తకు నైనా డెడ్‌‌బాడీ దొరికిన కారు రాజకీయ నాయకుడు తుషార్ (శివ పండిట్)ది అని తెలుస్తుంది. దాంతో అతనికి మర్డర్‌‌‌‌‌‌‌‌తో సంబంధం ఉందని అనుమానిస్తుంది. తర్వాత ఏం జరిగింది? తెలుసుకోవాలంటే వెబ్‌ సిరీస్‌‌‌‌ చూడాలి.