ఎయిర్​పోర్ట్ దారిని కమ్మేసిన పొగమంచు

ఎయిర్​పోర్ట్ దారిని కమ్మేసిన పొగమంచు

శంషాబాద్ పరిధిలోని నేషనల్ హైవే, ఎయిర్​పోర్ట్ దారిని పొగమంచు కమ్మేసింది. సోమవారం ఉదయం భారీగా పొగమంచు ఉండటంతో హైవేపై వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఉదయం 9 గంటలు దాటినా దారి సరిగా కనిపించకపోవడంతో వెహికల్స్​కు హెడ్ లైట్లు వేసుకుని వెళ్లారు.

మరికొందరు పొగమంచు తీవ్రత తగ్గే వరకు  వెహికల్స్ ను పక్కకు నిలుపుకున్నారు. ఎయిర్​పోర్టులో సైతం భారీగా పొగమంచు ఉండటంతో కొన్ని ఫ్లైట్​లు ఆలస్యంగా నడిచాయి. మరికొన్నింటిని అధికారులు దారి మళ్లించారు.