నక్సల్​బరీ ఉద్యమం.. భూమి, భుక్తి, విముక్తి నినాదాలతో లక్ష్య నిర్దేశం

నక్సల్​బరీ ఉద్యమం.. భూమి, భుక్తి, విముక్తి నినాదాలతో లక్ష్య నిర్దేశం
  • పశ్చిమ బెంగాల్​ రాష్ట్రం డార్జిలింగ్​ జిల్లాలోని నక్సల్​బరీ గ్రామంలో గిరిజన పోరాటం జరిగింది. 
  • నక్సల్​బరీ రైతాంగ ఉద్యమం భూమి, భుక్తి, విముక్తి నినాదాలతో తన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
  • నక్సల్బరీ గ్రామ జనాభాలో అత్యధికులు సంథాల్​ గిరిజనులు
  • గిరిజన రైతాంగాన్ని అధియార్​ పద్ధతి కింద దోపిడీ, పీడనలకు గురిచేసిన భూస్వాములను జోతేదార్లు అని పిలిచేవారు. 
  • నక్సల్​బరీలో ఒక జోతేదారు పంట పొలాన్ని రైతులు ఆక్రమించుకొని, చుట్టూ ఎర్రజెండాలు పాతి పంటను 1967 మార్చి 3న స్వాధీనం చేసుకున్నారు. 
  • నక్సల్​బరీ, ఖరీబారీ, పాన్సీదేవా పోలీస్​ స్టేషన్ల పరిధిలోని 274 మైళ్ల ప్రాంతంలో 1967 మార్చి, ఏప్రిల్​ మధ్యకాలంలోనే 60 చోట్ల పంట స్వాధీనం, భూ స్వాధీనం సంఘటనలు జరిగాయి. 
  • రైతాంగ పోరాటం మే 23–25 మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. రైతాంగాన్ని, గిరిజనులను నిర్బంధించడానికి గ్రామానికి వచ్చిన పోలీసులను ప్రజలు ఎదిరించారు. ఈ ఘర్షణలో ఒక పోలీస్​ ఇన్​స్పెక్టర్​ మృతిచెందాడు.
  • పోలీస్​ ఇన్ స్పెక్టర్​ మృతికి ప్రతీకారంగా మే 24న నక్సల్బరీలోని ప్రసాద్​జోతె గ్రామం మీద దాడి చేసిన పోలీసులు ఏడుగురిని కాల్చి చంపారు. 
  • నక్సల్బరీ పోరాట నాయకుడు చారు మజుందారు.
  • భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్​– లెనినిస్టు) పార్టీ 1969 ఏప్రిల్​ 22న ఏర్పడింది. 
  • దేశంలో వివిధ రాష్ట్రాల్లో రైతాంగ పోరాటాలు ప్రారంభమయ్యాయి. ఈ రైతాంగ పోరాటం ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైంది. 
  • సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో జరిగిన రైతు కూలీ పోరాటాలు ఉప్పెనలా ఎగసి ఉత్తర తెలంగాణ ప్రాంతమంతటికీ విస్తరించాయి.
  • ఆంధ్ర వలస పాలకులు చేతుల్లో స్థానిక భూస్వామ్య పెత్తందార్ల చేతిలో అవమానానికి గురైన తెలంగాణ యువతకు, రైతాంగానికి నక్సల్బరీ ఉద్యమం క్రాంతిరేఖగా కనిపించింది. 
  • ప్రజల్లో చైతన్యం, ఆత్మ విశ్వాసం, పోరాడే సంకల్పం కలిగితే తలెత్తే పరిణామాలకు సిరిసిల్ల, జగిత్యాల పోరాటాలు ప్రతీకలుగా నిలిచాయి. 
  • కరీంనగర్​ జిల్లాలోని రైతాంగం, రైతు కూలీలను భూస్వాములు  భాస్కరరావు, రాజేశ్వరరావు క్రూరంగా హింసించేవారు. 
  • మద్దనూరు గ్రామంలో జీతాలు, కూలీరేట్లు పెరగాలని జీతగాళ్లు, వ్యవసాయ కూలీలు 1978  జూన్​ 17న సమ్మె చేశారు. 
  • రైతాంగ పోరాటంలో బలంగా ముందుకు వచ్చిన పోరాట రూపం సాంఘిక  బహిష్కరణ.
  • సిరిసిల్ల తాలూకా కొదురుపాక గ్రామంలో మహిళా విముక్తి సంఘం అధ్యక్షురాలు రాజవ్వ.
  • మహిళా విముక్తి  సంఘం పేరుతో 25 గ్రామాల్ల భూస్వాముల ఆగడాలను, కూలీ పెరగాలని తెలుపుతూ ప్రజలను ముఖ్యంగా మహిళలను చైతన్యం చేయడంలో రాజవ్వ గణనీయమైన పాత్ర పోషించారు. 
  • సిరిసిల్ల, జగిత్యాల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా మర్రి చెన్నారెడ్డి 1978 అక్టోబర్ 20న ప్రకటించారు.  
  • తెలంగాణ ప్రాంత పరిస్థితులను అధ్యయనం చేసి రైతాంగ పోరాటాలు, న్యాయమైనవని, కల్లోలిత ప్రాంతాల ప్రకటన అనుచితమని టైమ్స్​ ఆఫ్​ ఇండియా, ది హిందూ, ఇండియన్​ ఎక్స్​ప్రెస్​ పత్రికలు వెల్లడించాయి. 
  • భిన్నమైన రైతాంగ పోరాటం జరిపిన కరీంనగర్​లోని నాగుల మాల్యాల గ్రామం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది. 
  • గ్రామ బహిష్కరణకు గురైన 15 రైతు కుటుంబాలు భూస్వామికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన సంఘటన కరీంనగర్​లో నాగుల మాల్యాలలో జరిగింది. 
  • గ్రామ బహిష్కరణకు గురైన నాగుల మాల్యాలకు చెందిన కుటుంబాలు  రాడికల్​ యువజన సంఘం ఏర్పర్చుకొని భూస్వామి దౌర్జన్యాలను ఎదిరించారు. 
  • పెద్దపల్లి తాలూకాలోని 50 గ్రామాల్లో వ్యవసాయ కూలీలు, పాలేర్లు, కూలీరేట్లు, జీతాలు పెరుగుదలకై సమ్మెలు ప్రారంభించి 1978 నవంబర్​లో విజయం సాధించారు. 
  • ఆదిలాబాద్​ జిల్లాలోని లక్సెట్టిపేట తాలూకాలో వ్యవసాయ కూలీలు, జీతగాళ్లు ఆర్థిక పోరాటాలు చేశారు. 
  • తునికాకు కూలీల పోరాటం విస్తృత స్థాయిలో కొనసాగి కాంట్రాక్టర్లు, భూస్వాముల దోపిడీని అరికట్టి కూలీ రేట్లను పెంచుకోవడానికి గిరిజనులంతా సమ్మె చేసిన సంఘటన ఆదిలాబాద్​ జిల్లాలో జరిగింది.
  • ఆదిలాబాద్​ జిల్లా గిరిజన రైతు కూలీ మహాసభ ఇంద్రవెల్లిలో జరిగింది.
  • ఆదిలాబాద్​ జిల్లా గిరిజన రైతు కూలీ సంఘం మహాసభ1981 ఏప్రిల్​ 20న జరిగింది. 
  • ఇంద్రవెల్లి మహాసభకు వచ్చిన వేల మంది గోండు గిరిజనులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 60 మంది చనిపోయారని పత్రికలు పేర్కొన్నాయి. 
  • ఇంద్రవెల్లి దుర్ఘటనకు నిరసనగా, రైతు కూలీ సంఘం మరో మహాసభను చెన్నూర్​లో నిర్వహించి జయప్రదం చేసింది.