హైవేల విస్తరణతో...బిజినెస్​ల జోరు

హైవేల విస్తరణతో...బిజినెస్​ల జోరు
  • పెరిగిన ప్రయాణాలు భారీగా స్టోర్లు, హోటళ్ల ఏర్పాటు

న్యూఢిల్లీ: దేశమంతటా హైవేలు, రోడ్లు పెరుగుతుండటంతో వీటి పక్కన బిజినెస్​ చేసుకొనే  వ్యాపారులకు, కంపెనీలకు ఎంతో మేలు జరుగుతోంది. కన్జూమర్ ​గూడ్స్, ఆహారం బాగా అమ్ముడవుతున్నాయి. పనికి  లేదా హాలిడేకు సంబంధించిన ప్రయాణాలు గణనీయంగా పెరుగుతున్నాయి.గతంలో అందుబాటులో లేని ప్రాంతాలకూ కనెక్టివిటీ విస్తరిస్తోంది. కార్లు కొనేవారి సంఖ్య పెరుగుతోంది. గతంలో స్తబ్తుగా ఉన్న ప్రాంతాల్లోనూ ఇప్పుడు జోష్​ కనిపిస్తోంది. మెరుగైన కనెక్టివిటీతో పాటు, కరోనా ముగింపు వల్ల రోడ్డు ప్రయాణాలు అధికమవుతున్నాయి. కుటుంబాలు,  స్నేహితులు కలిసి తరచూ సమీపంలోని హిల్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు వెళ్లడం ఎక్కువయింది. ఈ ట్రెండ్ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైడ్ స్నాక్స్, డ్రింక్స్​కు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచుతోంది. ఇటీవలి ఇంటర్వ్యూలో, నెస్లే ఇండియా బాస్ సురేశ్ నారాయణన్ మాట్లాడుతూ, దేశంలోని హైవేల వెంబడి రిటైల్ రియల్ ఎస్టేట్ క్వాలిటీ మెరుగుపడిందని, పెద్ద కంపెనీలు అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తెరవడం సులువుగా మారిందని అన్నారు. “హైవేల అభివృద్ధితో  చాలా మంచి జరుగుతోంది. అందరికీ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తోంది. డిస్ట్రిబ్యూషన్​ మెరుగుపడుతోంది. కొనుగోళ్లు మరింత బలంగా ఉంటాయి. బ్రాండ్లు విస్తరిస్తాయి. లక్నో– నుంచి వారణాసికి  ఇప్పుడు నాలుగు గంటల్లో వెళ్లవచ్చని తెలిసి ఆశ్చర్యపోయాను. రెండు వైపులా  హోటళ్ళు,  రెస్టారెంట్లు ఉన్నాయి. బిల్డింగ్స్​ చాలా బాగున్నాయి. వీటిలో మ్యాగీ, నెస్కేఫ్, కిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివి దొరుకుతున్నాయి. మాకు దేశవ్యాప్తంగా దాదాపు 750 (నెస్కేఫ్) స్టాల్స్ ఉన్నాయి”అని నారాయణన్ అన్నారు. చిన్న పట్టణాల్లో, నగరాల్లో డిస్ట్రిబ్యూషన్​పై దృష్టి సారించే తమ సంస్థ "రూర్​ అర్బన్" వ్యూహానికి మెరుగైన కనెక్టివిటీ కూడా సహాయపడుతుందని నారాయణన్ అన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయని, మెరుగైన హైవేలు, మెరుగైన కనెక్టివిటీ, మెరుగైన రిఫ్రిజిరేషన్​ వల్ల బ్రాండ్లు కన్జూమర్లకు సమర్థంగా సేవలు అందిస్తున్నాయని వివరించారు. 

సెలవుల్లో చక్కర్లు...

 కరోనా బెడద తొలగిపోవడంతో  టూర్లు పెరిగాయని ఆపరేటర్లు చెబుతున్నారు. “భారతదేశంలోని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేలపై వెహికల్స్​ స్పీడ్​ పెరిగింది. నగరాలకు వేగంగా వెళ్లగలుగుతున్నారు. జనం బయటకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు" అని కోస్టా కాఫీ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ వినయ్ నాయర్ అన్నారు. చాలా కుటుంబాలు ఇప్పుడు విశ్రాంతి కోసం కలిసి ప్రయాణిస్తున్నాయని నాయర్ చెప్పారు. -అటువంటి ప్రయాణికులు తరచూ రిఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల కోసం హైవేలపై ఆగుతారు. ఇది వరకు రైల్వే స్టేషన్లలో, ఎయిర్​పోర్టుల్లో ఎక్కువగా కాఫీ తాగేవారని ఇప్పుడు హైవేలపైనా ఈ డ్రింక్​కు గిరాకీ పెరిగిందని నాయర్​ వివరించారు. ఈ కాఫీ చైన్  స్థానిక ఫ్రాంచైజీ పార్ట​నర్​ దేవయాని ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మరిన్ని హైవే స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రారంభించనుంది. రాబోయే 3-6  నెలల్లో  హైవేలపై మరింత అభివృద్ధి జరుగుతుందని నాయర్​ అన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా రిపోర్ట్​ ప్రకారం, 1950–2015 మధ్య కాలంలో నిర్మించిన వాటి కంటే 2025 నాటికి మరిన్ని జాతీయ రోడ్లు,  రైలు మార్గాలను నిర్మిస్తారు. అప్పటికి  రోడ్ల పొడవు 1,80,000 కిలోమీటర్లకు చేరుతుంది. రోడ్లు బాగుండటం వల్ల కంపెనీలు వస్తువులను ఈజీగా తరలిస్తాయని, కొత్త స్టోర్లను తెరుస్తాయని పెప్సికో ఇండియా సీనియర్​ఎగ్జిక్యూటివ్​ ఒకరు చెప్పారు. కాఫీ చెయిన్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బక్స్ కూడా రద్దీగా ఉండే హైవేలలో మరిన్ని అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేయనుంది. మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డొనాల్డ్ కూడా హైవేలపై మరిన్ని డ్రైవ్–త్రూ స్టోర్లను తెరవాలని చూస్తున్నది. 2027 నాటికి హైవేలపై 30–35 శాతం కొత్త అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటవుతాయని అంచనా.