నారియల్ పానీ ఇడ్లీ.. వీలైతే మీరూ ట్రై చేయండి

నారియల్ పానీ ఇడ్లీ.. వీలైతే మీరూ ట్రై చేయండి

ఈ రోజుల్లో ఎన్నో ఫేమస్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్, స్నాక్స్‌తో అనేక వెరైటీ ట్రయల్స్ జరుగుతున్నాయి. పానీ పూరీ, వడ పావ్, ఇడ్లీ లాంటి చాలా వంటకాలపై ఇప్పటికే ప్రయోగాలు చేయగా.. ఇప్పుడు మరో కొత్త వెరైటీ స్ట్రీట్ ఫుడ్ హల్ చల్ చేస్తోంది. నారియల్ పానీ ఇడ్లీ అనే పేరుతో వైరల్ అవుతోన్నఈ వంటకం కొబ్బరి, ఇతర పదార్థాల కలయికతో తయారవుతుంది. దీన్ని ముంబైలోని ఒక స్ట్రీట్ వ్యాపారి ప్రయత్నించారు.

ఈ కొత్త ఇడ్లీ వంటకాన్ని ఫుడ్ వ్లాగర్లు దిశా, వ్రుందా పన్సూరియా తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఎ బైట్ ఆఫ్ యమ్‌లో షేర్ చేశారు. ఈ తినుబండారం అవంతిక చెన్నై కేఫ్‌గా పిలువబడుతుందని, ఇది కండివాలి వెస్ట్‌లోని మహావీర్ నగర్‌లో డిమార్ట్ ఎదురుగా ఉందని వారు తెలిపారు. ఈ వీడియోలో ఫుడ్ స్టాల్ యజమాని తాను ముందుగా తయారుచేసిన ఇడ్లీ పిండిలో మంచి కొబ్బరి నీటిని కలుపుతున్నట్లు కనిపించాడు. ఆ తర్వాత దాన్ని పూల ఆకారపు అచ్చులలో పోస్తాడు. అవి సిద్ధమైన తర్వాత, అతను వాటిని పైన మెత్తని కొబ్బరి గుజ్జుతో, దానిమ్మపండు, సాంబార్, కొబ్బరి చట్నీతో అలంకరించాడు. ఈ నారియల్ పానీ ఇడ్లీ కేవలం 69 రూపాయలకే లభిస్తుంది.

Also Read : ఎంక్వైరీ స్పెషలిస్ట్ ఆఫీసర్ గా లంగూర్.. టెక్నాలజీపై మోజంటే ఇదేనేమో

నెటిజన్లు ఈ కొత్త వంటకంపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు విక్రేతకు సలహాలు ఇస్తూ “కొబ్బరి (చిప్ప), సగంలో సాంబారు వడ్డించండి” అని, “పొడి ఇడ్లీని ప్రయత్నించండి” అని చెబుతున్నారు. ఈ కొత్త రెసిపీని ప్రయత్నించడానికి ఆసక్తి చూపని కొందరేమో.. “ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ తమ ఇంగితజ్ఞానాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది” అంటూ తమ నిరాసక్తతను వ్యక్తం చేస్తున్నారు.