హైకోర్టు తీర్పు తర్వాతే కేటీఆర్ ఫాంహౌస్ కేసుపై విచారిస్తాం

హైకోర్టు తీర్పు తర్వాతే కేటీఆర్ ఫాంహౌస్ కేసుపై విచారిస్తాం

న్యూఢిల్లీ, వెలుగు: మంత్రి కేటీఆర్ ఫాంహౌస్ కేసు విచారణను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) వాయిదా వేసింది. హైదరాబాద్ శివారు జన్వాడలో జీవో నంబర్ 111ను ఉల్లంఘించి 25 ఎకరాల్లో కేటీఆర్ విలాస వంతమైన ఫాంహౌస్ నిర్మించుకున్నారని ఎంపీ రేవంత్ రెడ్డిఎన్టీనిజీ ఆశ్రయించారు.
జస్టిస్ రామకృష్ణన్, సైబల్ దాస్ గుప్తాలతో కూడిన డివిజన్ బెం చ్ బుధవారం ఈ పిటిషన్‌‌ను విచారించింది. ఈ అంశంపై హైకోర్టులో స్టే ఉందని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీఎస్ పీసీబీ) తరఫు లాయర్లు తెలిపారు. స్టే వెకేట్ కు తాము పిటిషన్ వేశామని పిటిషనర్ తరఫు లాయర్ శ్రవణ్ కుమార్ చెప్పారు. అయితే హైకోర్టు స్టే ఇచ్చినందున.. కేసు విషయంలో హైకోర్టు తీర్పు తర్వాతే తాము విచారణ చేపడతామని ఎన్జీటీ (చెన్నై బెంచ్) స్పష్టం చేసింది. అప్పటి వరకు కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.