ఇప్పటివరకు కొన్న వడ్లు 6.67లక్షల టన్నులు

ఇప్పటివరకు కొన్న వడ్లు 6.67లక్షల టన్నులు
  •      7,109 సెంటర్లలో కొనసాగుతున్న కొనుగోళ్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలు సెంటర్లలో ఇప్పటి వరకు 6.67లక్షల టన్నుల వడ్ల సేకరణ జరిగింది. సివిల్​ సప్లయ్స్​ డిపార్ట్​మెంట్​ రాష్ట్రంలో 7,109 సెంటర్లను ప్రారంభించింది. 1,01121 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించింది. తాజాగా రాష్ట్రమంతటా అకాల వర్షాలు పడుతుండటంతో సర్కారు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కొనుగోలు సెంటర్లలో టార్పాలిన్​లు అందుబాటులోకి తెచ్చి ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది.