డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela).. ఇపుడు ఈ పేరుకు టాలీవుడ్లో అఖండమైన క్రేజ్ ఉంది. డైరెక్ట్ చేసింది ఒక్క సినిమానే అయిన.. తన ఫస్ట్ మూవీతోనే వందకోట్ల బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్గా వచ్చిన దసరాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు. అయితే.. అతను ఎంచుకునే కథ, ఆ సహజమైన కథకు కిక్ ఇచ్చే స్క్రీన్ ప్లే.. అందులో భాగంగా హీరోకు మెంటల్ మాస్ ఇమేజ్.. ఇటువంటివి క్రియేట్ చేయడం తన స్టయిల్. ఇదే స్వాగ్తో తన రెండో మూవీ కూడా మొదలెట్టేసాడు. అదే ‘ది ప్యారడైజ్’ (TheParadise). నిర్మాత సుధాకర్ చెరుకూరి గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఇవాళ (డిసెంబర్ 14న) ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు బర్త్ డే విషెస్ చెబుతూ ప్యారడైజ్ మేకింగ్ వీడియో షేర్ చేసింది చిత్రబృందం.
‘‘స్వభావరీత్యా చాలా మౌనం.. సెట్స్‌లో మాత్రం అత్యంత ఉద్వేగభరితం. స్క్రిప్ట్ కోసం విస్ఫోటనంలా మారే అంతర్ముఖుడు. ఇతనే మన సైలెంట్ మాన్‌స్టర్.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. దిప్యారడైజ్ బృందం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. ఎల్లప్పుడూ ఇలాగే స్వాగ్ కంటిన్యూ చేయాలి’ అని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది చిత్రబృందం.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. శ్రీకాంత్ విజన్.. కథపై తనకున్న పట్టుదల, స్క్రీన్ ప్లేపై ఉన్న కాన్ఫిడెంట్ ఇచ్చిపడేసేలా ఉంది. బురదలో కూర్చుని సీన్ వివరించే విధానం.. సెట్స్ లో పూర్తిగా తన మేనరిజం అదిరిపోయింది. ఈ క్రమంలో టీమ్ మెంబర్స్కి సీన్ వివరించే స్టైల్ కిక్ ఇచ్చేస్తోంది. చరిత్ర ఎప్పుడు మొదలవుతుందంటే.. దానిమీద రక్తం పడినప్పుడు ఓపెన్ అవుతుంది. నరికినప్పుడు మాత్రమే కనబడాలి..’’ అంటూ మాట్లాడే మాటలు రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. ఓవరాల్గా అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిపడేసింది
‘ది ప్యారడైజ్’ :
‘ది ప్యారడైజ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా గొప్పగా రావడానికి మేకర్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఈ మూవీ కోసం అన్ని విభాగాలు అంతా నిరంతరం శ్రమిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, నాని లుక్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్గా నటిస్తున్నారు.
ఇందులో నాని ‘జడల్’ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. రగ్డ్ మీసం, గెడ్డం, రెండు జడలతో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని హడల్ పుట్టించేలా ‘జడల్’ లుక్స్ ఉన్నాయి. ఈ మూవీతో ‘కిల్’ ఫేమ్ రాఘవ జూయాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. 2026 మార్చి 26న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ సహా మొత్తం ఎనిమిది భాషల్లో పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేస్తున్నారు.
