‘కాంతార: చాప్టర్‌ 1’లో మా ఊరంతా భాగమైంది.. డైరెక్షన్‌‌‌‌కే నా ఫస్ట్ ప్రిఫరెన్స్.. రిషబ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

‘కాంతార: చాప్టర్‌ 1’లో మా ఊరంతా భాగమైంది.. డైరెక్షన్‌‌‌‌కే నా ఫస్ట్ ప్రిఫరెన్స్.. రిషబ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

‘కాంతార చాప్టర్ 1’ చిత్రానికి ఆడియెన్స్ ఇచ్చిన రెస్పాన్స్ ఎప్పటికీ మర్చిపోలేను అని రిషబ్ శెట్టి అన్నాడు. తను హీరోగా, దర్శకుడిగా రూపొందించిన ఈ సినిమా ఇటీవల విడుదలై తొలి వారంలో వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా రూ. 500 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ ‘ఈ విజయంలో భాగమైన తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక  కృతజ్ఞతలు. ‘కాంతార’కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో ఈ సినిమాకు కూడా అంత గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు. ఈ చిత్రంతో  జానపద కథలకు మళ్లీ పునర్వైభవం తీసుకొచ్చానని ప్రశంసలు రావడం చాలా ఆనందంగా ఉంది.

మన భారతదేశం జానపద కథలకు నిలయం. ఇది మా ప్రాంతంలో జరిగిన కథ. దీనికోసం మా ప్రాంతంలోనే ఒక ప్రత్యేకమైన స్టూడియో  ఏర్పాటు చేశాం. చిన్నప్పుడు నుంచి మా ఊర్లో షూటింగ్ చేయాలని కోరిక ఉండేది. మా ప్రాంతం వాళ్లు కూడా ఈ ప్రాసెస్‌‌‌‌లో ఇన్వాల్వ్ అవ్వడం సంతోషంగా ఉంది.

రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య , జయరాం గారి పాత్రలు కూడా అద్భుతమైన ఆదరణ పొందాయి. అజనీష్ లోకనాథ్ చాలా డిఫరెంట్‌‌‌‌గా మ్యూజిక్ కంపొజిషన్ చేశారు. ట్రైబల్ ఏరియాస్‌‌‌‌కి వెళ్లి అక్కడ ఒరిజినల్ స్కోర్‌‌‌‌‌‌‌‌ని రికార్డ్ చేశారు. హోంబలే ఫిల్మ్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. ఇక నటుడిగా నాకు సంతృప్తి ఉన్నా.. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం డైరెక్షన్‌‌‌‌కే ఇస్తాను. ప్రస్తుతం ‘జై హనుమాన్’ సినిమాలో నటిస్తున్నా’ అని రిషబ్ చెప్పాడు.