
సేవ్ ఎల్బీ స్టేడియం.. సేవ్ స్పోర్ట్స్ నినాదంతో ఎల్బీ స్టేడియం ముందు క్రీడాకారులు, కోచ్ లు ఆందోళనకు దిగారు. దేశానికి ఎంతో మంది ప్లేయర్లను అందించిన స్టేడియంను.. రాజకీయ పార్టీల సమావేశాలు, విందులకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇకపై పొలిటికల్ మీటింగ్స్ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని.. స్టేడియంను పరిరక్షించాలని డిమాండ్ చేశారు నిరసనకారులు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో.. బేగంబజార్ కార్పొరేటర్ సహా పలువురు క్రీడాకారులను అరెస్ట్ చేశారు పోలీసులు.