ఫామ్​హౌస్​లో న్యూసెన్స్..యువకుల అరెస్ట్

ఫామ్​హౌస్​లో న్యూసెన్స్..యువకుల అరెస్ట్

ఘట్​కేసర్, వెలుగు : ఫామ్​హౌస్లో బర్త్​డే పార్టీ పెట్టి న్యూసెన్స్ చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిజాంపేటకు చెందిన అఖిల్ కుమార్ గౌడ్(25) తన ఫ్రెండ్ అశోక్ బర్త్​డే వేడుకలను బుధవారం అర్ధరాత్రి ఘట్​కేసర్ ఎదులాబాద్ సమీపంలోని లివిన్ ఫామ్ హౌస్​లో నిర్వహించారు. 

అనుమతి లేకుండా మద్యం తాగుతూ డీజే పెట్టి న్యూసెన్స్​ చేశారు. దీంతో డీజే, మద్యం సీసాలను సీజ్​ చేసి, డీజే నిర్వాహకుడు బీబీనగర్​కు చెందిన పల్లెపాటి చరణ్(23)తోపాటు అఖిల్ కుమార్ గౌడ్, అశోక్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.