బంజారాహిల్స్ చోరీ కేసును చేధించిన పోలీసులు 

బంజారాహిల్స్ చోరీ కేసును చేధించిన పోలీసులు 

బంజారా హిల్స్  రోడ్ నెంబర్ 12లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. దొంగతనానికి పాల్పడిన వంట పని చేసే చంద్ర శేఖర్,రామ కిషన్ చౌదరిలను అరెస్ట్ చేశామని బంజారా హిల్స్ ఏసిపి సుదర్శన్ తెలిపారు.వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈనెల 4వ తేదీని ఇంట్లో నిద్రపోతున్న సమయంలో అర్థరాత్రి దుండగులు ఇంట్లోకి ప్రవేశించి అందినకాడికి దండుకున్నారు.15 లక్షలు నగదు, బంగారం గాజులు,నెక్లెస్,రింగులు,డైమండ్ చైన్లు,సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం, గొజ్రేజ్ లాకర్ దానిని కట్ చేయడానికి వాడిన మిషన్ , ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

ఇంటి యజమాని ఉదయం లేచి చూసే సరికి ఇళ్లు మొత్తం లూటీ చేసిన దృశ్యాలు కనిపించాయి. దీంతో హరియంత్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి టెక్నాలజీని ఉపయోగించి నిందితులను అరెస్టు చేశారు. సమీపంలోని సీసీ టీవీ దృశ్యాల ఆధానంగా చోరీ చేసిన దొంగలను పట్టుకున్నామని తెలిపారు. కొద్ది రోజుల్లోనే కేసు చేధించిన బంజారాహిల్స్ నేర విభాగం పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.