
హైదరాబాద్, వెలుగు : మల్టీ జోన్1లో ఇటీ వల బదిలీ ఆర్డర్లు ఆగిన స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, హిందీ, ఉర్దూ), పీడీల పోస్టింగ్ ఆర్డర్స్ రిలీజ్ అయ్యాయి. గవర్నమెంట్ తో పాటు లోకల్ బాడీ స్కూళ్లలో పనిచేసే 1,440 మందికి కొత్త స్కూళ్లు అలాట్ అయ్యాయి. గతవారమే మల్టీ జోన్1లో స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టు పోస్టులకు బదిలీ లు జరిగాయి. అయితే, అప్పుడు ఎస్ఏ లాంగ్వేజెస్, పీడీ పోస్టులకు ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్ ఇవ్వలేదు.