ఒక బిట్‌‌కాయిన్ ధర కోటి పది లక్షలపైనే

ఒక బిట్‌‌కాయిన్ ధర  కోటి పది లక్షలపైనే

న్యూఢిల్లీ: పాపులర్ క్రిప్టో కరెన్సీ బిట్‌‌కాయిన్ ఆదివారం (అక్టోబర్ 05) 1,25,627 డాలర్ల (రూ.1.10 కోట్ల)  వద్ద  ఆల్ టైమ్ గరిష్టాన్ని టచ్ చేసింది. ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో ఈ లెవెల్ నుంచి పడి 1,22,969 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. 

ఈ ఏడాది ఆగస్టులో నమోదైన 1,24,480 డాలర్ల లెవెల్‌‌ను  తాజాగా అధిగమించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో క్రిప్టోకు అనుకూలమైన నిబంధనలు ఉండడం,  ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరగడం,  బిట్‌‌కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో భారీగా పెట్టుబడులు వస్తుండడంతో ఈ క్రిప్టో కరెన్సీ దూసుకుపోతోంది.