ప‌ద్మా బ్రిడ్జ్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్ ప్రధాని

ప‌ద్మా బ్రిడ్జ్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్ ప్రధాని

ఢాకా : ప‌ద్మా న‌ది(గంగా న‌ది)పై నిర్మించిన ప‌ద్మా బ్రిడ్జ్‌ను బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ పొడువు 6.15 కిలోమీట‌ర్లు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం వ‌ల్ల ఢాకా, మోంగ్లా సీపోర్ట్ మ‌ధ్య దూరం త‌గ్గనుంది. ఇది రెండు అంత‌స్తుల బ్రిడ్జ్‌. దీంతో రోడ్డుతో పాటు రైలు మార్గం కూడా ఉంది.

బ్రిడ్జ్ పూర్తి కావ‌డం అంటే 17 కోట్ల మంది బంగ్లాదేశ్ ప్రజ‌లు క‌ల నిజ‌మైన‌ట్లు అని ప్రభుత్వ అధికారి తెలిపారు. ప‌ద్మా బ్రిడ్జ్‌ను పూర్తి చేయ‌డానికి 25 ఏళ్లు ప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. 1997లో తొలిసారి ప‌ద్మా బ్రిడ్జ్ నిర్మాణంపై ప్రధాని హ‌సీనా ప్రతిపాద‌న చేశారు. చైనా మేజ‌ర్ బ్రిడ్జ్ ఇంజ‌నీరింగ్ కంపెనీ ఈ బ్రిడ్జ్‌ను నిర్మించింది.