సెప్టెంబర్‌‌‌‌లో వర్షాలు పడకపోవడం వల్లే సమస్య

సెప్టెంబర్‌‌‌‌లో వర్షాలు పడకపోవడం వల్లే సమస్య

 

  •      ఇది ఏ పార్టీ తెచ్చింది కాదు
  •     స్వామినాథన్ స్ఫూర్తితో అగ్రికల్చర్‌‌‌‌ స్టూడెంట్లు ముందుకెళ్లాలి
         

కరీంనగర్, వెలుగు : సెప్టెంబర్‌‌‌‌లో వర్షాలు పడకపోవడం వల్లే కరువు పరిస్థితి ఏర్పడిందని, ఇది ఏ పార్టీ తెచ్చింది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ చెప్పారు. కరీంనగర్‌‌‌‌ రూరల్‌‌‌‌ మండలం ముగ్ధుంపూర్‌‌‌‌లో నిర్మిస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల బాలికల అగ్రికల్చర్‌‌‌‌ డిగ్రీ కాలేజీ భవన నిర్మాణానికి మానకొండూర్‌‌‌‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ వ్యవసాయ రంగ పితామహుడు స్వామినాథన్‌‌‌‌ స్ఫూర్తితో స్టూడెంట్లు మంచిగా చదువుకొని అగ్రికల్చర్‌‌‌‌ సైంటిస్ట్‌‌‌‌లుగా ఎదగాలని సూచించారు.

రైతు బిడ్డగా ఈ కాలేజీకి రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం అగ్రికల్చర్‌‌‌‌ స్టూడెంట్లతో మంత్రి మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్‌‌‌‌ సైదులు, ఆర్డీవో మహేశ్వర్, బీసీడీవో డీడీ అనిల్‌‌‌‌ ప్రకాశ్‌‌‌‌, ఎంపీటీసీ పుష్ప, ఆఫీసర్లు అంజలి, నరసింహారెడ్డి, నాయకులు పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌రెడ్డి, ఆకారపు భాస్కర్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.