నిజాం కాలేజీ విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించాలె

నిజాం కాలేజీ విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించాలె

నిజాం కాలేజీ విద్యార్థుల డిమాండ్లపై ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. నిజాం కాలేజీలో యూజీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు భట్టి విక్రమార్క, మధుయాష్కి, చెరుకు సుధాకర్ మద్ధతు తెలిపారు. నూతనంగా నిర్మించిన హాస్టల్లో యూజీ విద్యార్థులకు మొత్తం గదులు కేటాయించేంతవరకు అండగా ఉంటామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. 

ఆడపిల్లలపై కేసులు పెట్టాలని  టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించడం దారుణమన్నారు. మిట్టల్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరించకుండా సమస్యను త్వరగా పరిష్కరించాలని సూచించారు.