టీఎస్​టీపీపీ లో పూర్తిస్థాయి విద్యుత్ ​ఉత్పత్తి.. ఆఫీసర్లు, సిబ్బంది సంబరాలు

టీఎస్​టీపీపీ లో పూర్తిస్థాయి విద్యుత్ ​ఉత్పత్తి.. ఆఫీసర్లు, సిబ్బంది సంబరాలు

జ్యోతినగర్, వెలుగు: ఎన్టీపీసీ నిర్మిస్తున్న తెలంగాణ సూపర్​ థర్మల్​ పవర్​ ప్రాజెక్ట్ (టీఎస్​టీపీపీ) 800  మెగా వాట్ల ఒకటో యూనిట్​లో ఆదివారం రాత్రి 8గంటల ప్రాంతంలో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు. మార్చి 25న ఒకటో యూనిట్ నిర్మాణం పూర్తికాగా ఉత్పత్తి ప్రారంభించారు. టెక్నికల్​ ఇష్యూతో  వారం రోజుల తర్వాత ఉత్పత్తి నిలిచి పోయింది.  వాటిని గుర్తించి 3 నెలల తర్వాత ఈ నెల 19 బాయిలర్ ను వెలిగించారు. ఈ క్రమంలో ఒకటో యూనిట్​లో  పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేపట్టగా విజయవంతమైంది.  

దీంతో ఆఫీసర్లు, సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. ప్రాజెక్ట్  సీజీఎం కేదార్ రంజన్ పాండ్ స్వీట్లు పంపిణీ చేశారు. పూర్తి స్థాయి కమర్షియల్ డిక్లరేషన్​ ఈనెల 28 లోపు చేసేందుకు ఆఫీసర్లు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టులో  రెండో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి దశలోకి వచ్చే అవకాశం ఉంది.   దీంతో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రానికే అందనుంది.