కాబోయే సీఎం అన్నది అవాస్తవం

కాబోయే సీఎం అన్నది అవాస్తవం

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు ఇస్తే ఎవరు నెరవేర్చాలన్నారు మంత్రి కేటీఆర్. మున్సిపల్ మంత్రిగా కొత్త మున్సిపల్  చట్టాన్ని కఠినంగా అమలు చెయ్యడమే తన ముందు ఉన్న సవాల్ అన్నారు. కాంగ్రెస్ అడ్డుకోవడం వల్లే మున్సిపల్ ఎన్నికలు  ఆలస్యం అయ్యాయని తెలిపారు. GHMC ఎన్నికలు టైంకే జరుగుతాయన్న మంత్రి…అవి కూడా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం  చేశారు. తాను కాబోయే సీఎం అన్నది వాస్తవం కాదన్నారు. GHMC  విభజన ఆలోచన ఇప్పట్లో లేదన్నారు. ఉన్న GHMCని  తగ్గించాలి అన్నది తన వ్యక్తిగత  అభిప్రాయం మాత్రమేనన్నారు కేటీఆర్.

ఎన్నికలు అన్నాక  టికెట్స్ రాని వాళ్లు చాలా ఆరోపణలు చేస్తారన్న కేటీఆర్… వాటిని  సీరియస్ గా  తీసుకోమన్నారు. కాంగ్రెస్  పార్టీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్తారని తెలిపారు. 5 రూపాయల భోజనం అంటున్న కాంగ్రెస్……జానారెడ్డి ఇప్పటికే  తాము  అందిస్తున్న మీల్స్ తిని …మేచ్చుకున్నారని గుర్తు చేశారు. గవర్నర్ ప్రజా దర్బార్ పై తమకు సమాచారం లేదన్నారు. మున్సిపల్  ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాని తెలిపారు. TRS రెబల్స్ కి  కూడా ఈ రెండు పార్టీలు మద్దతు  ఇస్తున్నాయన్నారు. 90 శాతం  రెబల్స్  సమస్య పరిష్కారం అయ్యిందని తెలిపారు.

టీఆర్ఎస్ ను గెలిపిస్తే  పచ్చదనం పరిశుభ్రత, కొత్త మున్సిపల్ చట్టాన్ని కటినంగా అమలు చేస్తామన్నారు. పట్టణ ప్రగతిని  పరుగులు పెట్టిస్తామని తెలిపారు బీజేపీ నేతలు మీకు దమ్ముంటే అభ్యర్థులను పోటీకి పెట్టాలన్నారు. స్మార్ట్  సిటీలుగా ఎన్ని మార్చారో లక్ష్మణ్ చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీజెేపిీ పార్టీలు పొత్తులు పెట్టుకొని…  బయట డ్రామాలు ఆడుతున్నాయన్నారు. కొల్లాపూర్ రెబల్స్ తో సహా అందరూ దారికొస్తారన్నారు కేటీఆర్.