The Railway Men: ఉత్తమ డైలాగ్‌ అవార్డును సొంతం చేసుకున్న ది రైల్వే మెన్ మేకర్స్

The Railway Men: ఉత్తమ డైలాగ్‌ అవార్డును సొంతం చేసుకున్న ది రైల్వే మెన్ మేకర్స్

గుండెలకు హత్తుకునే ఎమోషన్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్..'ది రైల్వే మెన్‌' (The Railway Men)..భోపాల్‌ గ్యాస్‌ లీక్‌ (Bhopal Gas Leak) ప్రమాదం జరిగినప్పుడు..అక్కడ చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడిన రైల్వే ఉద్యోగుల జీవిత కథ ఆధారంగా ది రైల్వే మెన్‌ ను డైరెక్టర్ శివ్‌ రావలి (Shiv Rawail) తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజయ్యాక .దేశంలోనే అతిపెద్ద విపత్తు అయిన భోపాల్‌ గ్యాస్‌ ఘటనను కళ్ళకట్టినట్లుగా చూపించింది. 

తాజాగా ది రైల్వే మెన్‌ వెబ్ సిరీస్ కి స్క్రీన్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ అవార్డ్స్‌లో ‘ఉత్తమ డైలాగ్‌ అవార్డు వరించింది. నాలుగు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్‌సిరీస్‌ నవంబర్‌ 18, 2023 న నెట్ఫ్లిక్ (Netflix) లోస్ట్రీమింగ్ చేయగా ప్రతి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పలు అవార్డ్స్ గెలుచుకుంది. తాజాగా స్క్రీన్‌ రైటర్స్‌ విభాగంలో డైలాగ్స్ సంబంధించిన అవార్డు రావడంతో మేకర్స్ ఖుషి అయ్యారు.

ఈ సిరీస్‌ ఫస్ట్ ఎపిసోడ్‌లో ‘మన దేశంలో పప్పు, ఉప్పూ కన్నా చౌకగా లభించేది సామాన్యుడి జీవితం’ అనే డైలాగ్‌ ప్రతి భారత సామాన్యుడికి కనెక్ట్‌ అయింది. ది రైల్వే మెన్‌ కథలో బలమైన భావోద్వేగాలు పండేలా ఆయుష్‌ గుప్త, శివ్‌ రావైల్‌ పాత్రలను, వారి డైలాగ్స్ ను తీర్చిదిద్దారు. ఈ సిరీస్ లో మాధవన్‌, దివ్యేందు, కేకే మీనన్‌, బాబిల్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. 

1984 మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన గ్యాస్‌ లీక్‌ ప్రమాదం ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తు. యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌(UCIL) ప్లాంట్‌లో మిథైల్‌ ఐసోసైనైడ్‌ అనే విషపూరిత రసాయనం విడదల కావడంతో చాలామంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, వేలమంది తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు.. మరో 6 లక్షల మందిపై ప్రభావం చూపించింది ఈ  గ్యాస్‌ లీకేజీ ప్రమాదం. దాదాపు కొన్ని తరాల పాటు కనిపించింది ఈ విషపూరిత రసాయన ప్రభావం. ఈ దుర్ఘటన జరిగి దాదాపు 39 ఏళ్లు పూర్తికావొస్తోంది.