వర్షం..ఆయన్ను కోటీశ్వరుడిని చేసింది.. ఎలాగంటే ..

వర్షం..ఆయన్ను కోటీశ్వరుడిని చేసింది.. ఎలాగంటే ..

వర్షం పడిందంటే అందరూ దుక్కి దున్ని విత్తనాలు జల్లుతున్నారు.  కాని ఏపీలో ఓ ప్రాతంలో మాత్రం ఏదైనా వస్తువు కింద పడిపోతేఎలా వెతుక్కుంటామో .. అలా పొలాల్లో వెతుకుతుంటారు.. వీరంతా పిచ్చోళ్లు అనుకుంటున్నారా.. కాదండోయ్ అలా వెతికిన ఓ రైతు ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు. 

వివరాల్లోకి వెళ్తే..

వర్షం పడిదంటే చాలు కర్నూ లు జిల్లాలో రైతులు పిల్లా పాపలతో సహా పొలాల్లో ప్రతి అంగుళాన్ని కూడా శోధిస్తారు.  ఈ ప్రాంతం వజ్రాలు దొరుకుతాయని నానుడి ఉంది. గతంలో కూడా ఇక్కడ వజ్రాలు దొరికిన సంఘటనలున్నాయి.  అందుకే వర్షం పడిందంటే చాలు పొలాల్లో తిష్ట వేస్తారు.  అలా తిష్ట వేసిన రైతును వర్షం కోటీశ్వరుడిచి చేసింది.  అతని పొలంలో ఖరీదైన వజ్రం దొరికింది.  ఇక అంతే అతని దశా దిశా రెండు మారింది. 

వజ్రం దొరికింది.. 

కర్నూలు జిల్లా  మద్దెకర మండలంలోని బసినేపల్లి లో ఓ రైతుకు వజ్రం కళ్లబడింది. ఆ వజ్రాన్ని అక్కడే అమ్మకానికి పెట్టాడు. అక్కడే వేచి చూస్తున్న వ్యాపారికి అమ్మకానికి పెడితే.. దాన్ని రూ. 2 కోట్లు పలికినట్లుగా ప్రచారం సాగుతోంది.. ఆ విషయం అందరికి తెలియడంతో జనాలు పొలాల్లో వాలిపోయారు.. వర్షాలు పడ్డప్పడు వెదికితే వజ్రాలు దొరుకుతాయని.. స్థానికులు ఏటా ఈ సమయంలో వెదుకులాడుతుంటారు. తమకు కూడా వజ్రం దొరకకపోతుందా అనే ఆశతో వెతుతుంటారు.. ఇక అనంతపూర్ లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని జనాలు అంటున్నారు.. అక్కడ కూడా వర్షం పడితే జనాలు పొలాల్లో వాలిపోతున్నారు..

రెండు జిల్లాల సరిహద్దుల్లో..

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు రెండు జిల్లాల సరి హద్దుల్లో విలువైన వజ్రాలు దాగున్నాయని చెబుతున్నారు. వర్షం వస్తే ఇక్కడి నేలలపై పంటలు పండుతాయో లేదోగానీ.. వజ్రాలు మాత్రం పండుతాయని నమ్మకం. అందుకే వాన పడినప్పుడల్లా ఇక్కడి ప్రజలు వజ్రాన్వేషణ లో ఉంటారు.. తాజాగా కురిసిన వర్షం జనాల్లో కొత్త ఊపును తెచ్చింది.. మద్దికెర ప్రాంతంలో వజ్రాల వేట తరచూ మనం వినేదే. ఆ నేలల్లో వజ్రాల వేట కోసం వేరేవేరే జిల్లాల నుంచి జనం వస్తుంటారు. విలువైన రాయిలా అనిపిస్తే చాలా పరుగున వజ్రాల వ్యాపారుల దగ్గరకు వెళ్తారు. కొనేందుకు అక్కడ వ్యాపారుల మధ్య కూడా పోటీ ఉంటుంది. రైతులు కూడా ఇక వ్యాపారులకు గట్టి పోటీని ఇస్తూ వజ్రాలను అన్వేషిస్తున్నారు.. 

 

READ ALSO:నితీశ్​ ఫ్రంట్ కు తెలంగాణలో నో టెంట్!