
ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటి ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం (sept29) సాయంత్రం 6 గంటలకి విడుదల చేశారు. ఇందులో హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రభాస్ చేసిన ఫన్, వింటేజ్ స్క్రీన్ ప్రజెన్స్, ముగ్గురి హీరోయిన్స్తో రొమాంటిక్ సీన్స్.. ఇలా ప్రతిదీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
ఈ క్రమంలోనే రాజాసాబ్ ట్రైలర్కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. రెబల్ ఫ్యాన్స్తో పాటుగా, కామన్ సినీ ఆడియన్స్కి హారర్ రొమాంటిక్ ఫీస్ట్ అందిస్తుంది. ఇపుడు ఈ ట్రైలర్ యూట్యూబ్లో రిలీజైన 18 గంటల్లో 40 మిలియన్లకి పైగా వ్యూస్తో దూసుకెళ్తోంది (40 మిలియన్లు=4 కోట్లు). ఈ కౌంట్ గంట గంటకు పెరుగుతుండటం విశేషం.
ఈ విషయాన్ని చెబుతూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘ది రాజా సాబ్’ట్రైలర్.. రాయల్ బ్లాస్ట్ అభిమానులు ఎంత చూసినా సరిపోదు. అన్నీ వర్గాల ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ అందుకుంది. 40 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ దాటి సంచలనం సృష్టించింది’’అని ట్వీట్ చేశారు. అయితే, తెలుగు ట్రైలర్కి కంటే హిందీ ట్రైలర్కే ఎక్కువ వ్యూస్ వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
#TheRajaSaabTrailer is a ROYAL BLAST fans can’t get enough of ❤️🔥
— People Media Factory (@peoplemediafcy) September 30, 2025
Smashes past 40 Million+ Digital Views with absolute dominance 🔥
▶️ https://t.co/OQZXkLwbrZ#TheRajaSaabOnJan9th #TheRajaSaab #Prabhas @DuttSanjay @DirectorMaruthi @AgerwalNidhhi @MalavikaM_ #RiddhiKumar… pic.twitter.com/4MlrVuEifL
ట్రైలర్ ఎలా ఉందంటే:
ఫన్, ఫియర్‌తో పాటు వింటేజ్ ప్రభాస్‌ను ఆల్ట్రా స్టైలిష్‌గా ఇందులో చూపించారు. ప్రభాస్‌ను ఒక హిప్నాటిస్ట్ (బోమన్ ఇరానీ) ఓ భారీ హవేలీలోకి తీసుకెళ్లడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అక్కడ అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటాయి. దానికి కారణం ప్రభాస్ తాత (సంజయ్ దత్). సైకలాజికల్‌గా అన్ని విద్యలు తెలిసి, ప్రేతాత్మలను నియంత్రిస్తూ బ్రెయిన్‌తో గేమ్ ఆడుకునే ఆ తాత శక్తిని ఎదుర్కొవడం ఆసాధ్యం.
‘అభీ దేఖ్ లీజియో..’ అంటూ ఆ దుష్టశక్తిని ఎదుర్కొనేందుకు రాజా సాబ్‌గా హవేలీలోకి అడుగుపెడతాడు ప్రభాస్. రాజా సాబ్ లుక్‌లో ప్రభాస్ మేకోవర్, స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ సినిమాపై హైప్‌ను పెంచేలా ఉన్నాయి. మొసలితో ప్రభాస్ చేసిన ఫైట్, దుష్టశక్తులతో పోరాడే తీరు హైలైట్‌గా నిలుస్తుంది.
ఈ హారర్ ఎలిమెంట్స్‌తో పాటు హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్‌లతో ప్రభాస్ చేసిన ఫన్, రొమాంటిక్ సీన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. కార్తీక్ పళని విజువల్స్, తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఈ ట్రైలర్ పండుగ ఫీస్ట్‌ను అందించేలా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.