
రాజకీయాలను డబ్బు శాషిస్తోందన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పార్లమెంటుకు పోటీ చేస్తున్న ధనవంతులు ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పార్టీలు చేస్తున్న ఖర్చును.. ఎన్నికల కమిషన్ నిరోధించటం సాధ్యం కాదని….. ప్రజలు, సంఘాలు అంతా పొలిటికల్ అవినీతి నిరోధానికి కృషి చేయాలన్నారు.
మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ అంశంపై గచ్చిబౌలిలో జరుగుతున్న సదస్సులో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో సంస్కరణలు జరగాలన్నారు వెంకయ్య. కఠిన నిర్ణయాలు ఇప్పుడు భాదపెట్టినా భవిష్యత్ లో లాభం ఉంటుందన్నారు ఉప రాష్ట్రపతి.