మనీష్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ పై తీర్పు రిజర్వ్

మనీష్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ పై తీర్పు రిజర్వ్

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 20వ తేదీ శనివారం రూస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన సీబీఐ, ఈడీ కేసుల్లో రెగ్యులర్ బెయిల్ కోరుతూ మనీష్ సిసోడియా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, మనీష్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును సీబీఐ వ్యతిరేకించింది. 

ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయినందున ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు విన్న ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు మనీష్ సిసోడియా బెయిల్ పై తీర్పును రిజర్వ్ చేస్తూ.. ఏప్రిల్ 30న తీర్పు వెలువరించనున్నట్లు తెలిపింది.

ఇక,  మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సిసోడియా ఉపసంహరించుకున్నారు.  లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఎన్నికల ప్రచారం కోసం తనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు.  కాగా, లిక్కర్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మనీస్ సిసోడియాను సీబీఐ, ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.