కవిత కస్టడీ పొడిగింపు

కవిత కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో.. శుక్రవారం జైలు అధికారులు వర్చువల్‌గా కవితను కోర్టులో హాజరుపరిచారు. కవిత తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తూ.. సీబీఐ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జ్​షీట్​ను పరిశీలన చేయాల్సి ఉందన్నారు.

దర్యాప్తు సంస్థ సమర్పించిన చార్జ్​షీట్​లోని పేపర్లకు ఒకవైపు మాత్రమే పేజీ నంబర్లు వేశారని, దీనివల్ల వాదనలు వినిపించే సమయంలో ఇబ్బందిగా ఉందన్నారు. సీబీఐ తరపు అడ్వొకేట్ స్పందిస్తూ.. ఆగస్టు 14 వరకు చార్జ్​షీట్​లోని పేజీలను సరిచేసి కోర్టులో సమర్పిస్తామన్నారు.

అనంతరం విచారణను ఈ నెల 21కు వాయిదా వేసింది. ఈ స్కాంకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరు తూ ఈ నెల 8న ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. సోమవా రం ఈ కేసు విచారణకు రానుంది.