
కోల్ కతా : బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోంది. రాష్ట్రంలోని 3,317 గ్రామ పంచాయతీలు, 341 పంచాయతీ సమితిలు, 20 జిల్లాపరిషత్‌లు సహా మొత్తం 74 వేల సీట్లకు శనివారం పోలింగ్ జరగగా.. మంగళవారం కౌంటింగ్ ప్రారంభమైంది. సాయంత్రానికి 12,518 స్థానాలను టీఎంసీ కైవసం చేసుకుంది. మరో 3,620 స్థానాల్లో ఆ పార్టీ లీడింగ్‌లో ఉంది.
టీఎంసీ తర్వాత బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కమలం పార్టీ 2,781 సీట్లను గెలుచుకుని, 915 సీట్లలో లీడింగ్ లో ఉంది. ఇక లెఫ్ట్ ఫ్రంట్ 959 స్థానాల్లో గెలవగా.. అందులో సీపీఎం ఒక్కటే 910 సీట్లను కైవసం చేసుకుంది. మరో 550 సీట్లలో లీడింగ్ లో ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 625 సీట్లలో గెలిచి, 276 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.