వర్షం కారణంగా రెండో వన్డే రద్దు 

వర్షం కారణంగా రెండో వన్డే రద్దు 

హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌ వేదికగా జరగాల్సిన భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. 4వ ఓవర్ జరుగుతున్నప్పుడు వర్షం పడగా మ్యాచ్ కు కొద్ది సేపు అంతరాయం ఏర్పడింది. తర్వాత ఎంపైర్లు మ్యాచ్ ను 29 ఓవర్లకు కుందించారు. మ్యాచ్ మొదలవ్వగానే ధవన్ ఔట్ అయ్యాడు.

తర్వత క్రీజ్ లోకి వచ్చిన సూర్య కుమార్ (34), శుభ్ మన్ గిల్ (45)తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ 12.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 89 పరుగులు చేసిన సమయంలో మళ్లీ వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో చివరికి ఆటని రద్దు చేస్తునట్లు ప్రకటించారు ఎంపైర్లు.