ఆర్డర్ సిద్ధమవుతోంది.. విజయ్ లియో ట్రైలర్ వచ్చేస్తోంది..ఎప్పుడంటే?

 ఆర్డర్ సిద్ధమవుతోంది.. విజయ్ లియో ట్రైలర్ వచ్చేస్తోంది..ఎప్పుడంటే?

దళపతి విజయ్( Thalapathy Vijay) నటిస్తున్న లియో(Leo) మూవీ నుంచి ట్రైలర్ అప్డేట్ ను వెరైటీ స్టైల్లో పోస్ట్ చేశారు మేకర్స్. 'మీ ఆర్డర్ సిద్ధమవుతోంది. విజయ్ లియో ట్రైలర్ వచ్చేస్తోంది. మీ మీల్ ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండండి. మీ డెలివరీ పార్ట్‌నర్ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్(Seven Screen Studio) అక్టోబర్ 5న డెలివరీ చేస్తుందంటూ..ట్రైలర్ డేట్‍ ను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.  

ఇప్పటికే లియో నుంచి రిలీజ్ చేసిన టీజర్, హెరాల్డ్ దాస్ గ్లింప్స్, పోస్టర్స్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ గమనిస్తే..రక్తం మరకలతో విజయ్..మంచు కొండల నడుమ హైనా (జంతువు)తో పోరాడుతున్నట్టుగా ఉంది. దీంతో డైరెక్టర్ లోకేష్..కాశ్మీరీ ప్రాంతపు సరిహద్దులో ఊహించని విధంగా సీన్స్ తెరకెక్కించినట్లు తెలుస్తుంది. 

లోకేశ్ కానగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. లోకేష్ యూనివర్స్ లో భాగంగా వస్తోన్న మూవీ కావడంతో పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ గత చిత్రాలైన ఖైదీ, మాస్టర్, విక్రమ్ బాక్సాపీస్ వద్ద భారీ సక్సెస్ ను అందుకున్నాయి. అలాగే మాస్టర్ తర్వాత విజయ్..లోకేశ్ కాంబినేషన్‍లో వస్తున్న రెండో మూవీ కావడంతో హైప్ అమాంతం పెరిగిపోయింది. 

ALSO READ : Asian Games 2023: ధోనీని చూసి చాలా నేర్చుకున్నా.. కానీ అతన్ని ఫాలో అవ్వను: గైక్వాడ్ 

విజయ్ కు జోడీగా హీరోయిన్‍గా త్రిష నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తో అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. అక్టోబర్ 19న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.