Asian Games 2023: ధోనీని చూసి చాలా నేర్చుకున్నా.. కానీ అతన్ని ఫాలో అవ్వను: గైక్వాడ్ 

Asian Games 2023: ధోనీని చూసి చాలా నేర్చుకున్నా.. కానీ అతన్ని ఫాలో అవ్వను: గైక్వాడ్ 

భారత యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ జాతీయ జట్టులోకి రావడం వెనుక మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాత్ర ఉందన్న విషయం ప్రత్యేకంచి చెప్పక్కర్లేలేదు. అతనిలో ఉన్న నైపుణ్యాన్ని పసిగట్టిన ధోని అతనికి అనేక అవకాశాలు కల్పించి.. ఆశించిన ఫలితాలు రాబట్టాడు. ఎంతో పరిణితి కలిగిన బ్యాటర్‌గా రూపుదిద్దాడు. ఈ క్రమంలో గైక్వాడ్ కూడా ధోనీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ప్రశాంతంగా ఎలా ఉండాలో దగ్గర నుంచి.. కెప్టెన్‌గా ఎలాంటి వ్యూహాలు అములుచేయాలో వరకు పలు విషయాలు తెలుసుకున్నాడు. ఇవే అతనిలో కాస్త తలపొగరు పెంచాయి.

26 ఏళ్ల ఈ మహారాష్ట్ర ఓపెనర్ ఆసియా క్రీడల్లో భారత జట్టును నడిపించనున్నాడు. జాతీయ జట్టు పగ్గాలు చేపట్టడం ఇదే అతనికి తొలిసారి. ఈ క్రమంలో రుతురాజ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దోనీ  నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానన్న ఈ యువ ఓపెనర్.. వాటిని మాత్రం పాటించనని తెలిపాడు. "నాయకుడిగా ధోనీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. కానీ, వాటినే పాటించాలని లేదు. ఒక్కోక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. మాహీ వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. నా ఆలోచనలు, వ్యూహాలు వేరు. కానీ, కొన్ని విషయాలను ఆయన నుంచి తీసుకోవాల్సిందే. పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలి..? మ్యాచ్‌ సమయంలో ఆటగాళ్లతో ఎలా ప్రవర్తించాలి? వంటివి. ఏదేమైనా ఈసారి నా శైలిలో నేను ప్రయత్నిస్తా.." అని రుతురాజ్ మీడియా సమావేశంలో వెల్లడించాడు.

ALSO READ : కాంగ్రెస్కు అధికారం ఇస్తే రైతుల జీవితం అంధకారమే : కేటీఆర్

గైక్వాడ్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సమర్దిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ వ్యూహాలు కాదనడం సరికాదని కొందరు వాదిస్తుంటే, దేశానికి బాధ్యత వహిస్తున్న సమయంలో ఇలాంటి అర్థం లేని వ్యాఖ్యల వల్ల లాభం ఉండదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.  

అక్టోబర్ 3న ఇండియా- నేపాల్ మ్యాచ్

ఆసియా క్రీడల్లో భాగంగా భారత జట్టు అక్టోబర్ 3న నేపాల్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. ఉదయం 6:30 గంటలకు ప్రారంభంకానుంది. కాగా, మహిళల విభాగంలో భారత మహిళా జట్టు ఇప్పటికే స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.