పెద్ద గ్లాసుల్లో పోస్తే ఎక్కువ తాగుతున్నరట!

పెద్ద గ్లాసుల్లో పోస్తే ఎక్కువ తాగుతున్నరట!

గ్లాస్‌‌‌‌‌‌‌‌ సైజును బట్టి మందును లాగించేస్తున్నరట మందుబాబులు. అవును, గ్లాసు ఎంత పెద్దదైతే అంత ఎక్కువ తాగేస్తున్నరట. అవును, పెద్ద గ్లాసుల్లో ఎక్కువ తాగేస్తున్నారని బ్రిటన్‌‌‌‌‌‌‌‌లోని యూనివర్సిటీ ఆఫ్​ కేంబ్రిడ్జి స్టడీలో వెల్లడైంది. అయితే ఈ ఎఫెక్ట్ కేవలం రెస్టారెంట్లలో మాత్రమే ఉందని, బార్లలో ఇలాంటి ప్రభావం లేదని తెలిపింది. రెస్టారెంట్లు 300 ఎంఎల్ గ్లాసులకు బదులు 370 ఎంఎల్ గ్లాసులలో వైన్ సర్వ్ చేసినప్పుడు సేల్స్ ఎక్కువ ఉంటున్నాయని, అదే 250 ఎంఎల్ గ్లాసులలో సర్వ్ చేసినప్పుడు సేల్స్ తక్కువగా ఉంటున్నాయని ఈ స్టడీ వెల్లడించింది. అట్లా అని పెద్ద గ్లాసుల్లో ఎక్కువగా వైన్ పోయడం లేదు. రెండు డిఫరెంట్ సైజుల గ్లాసులలో ఒకే పరిమాణంలో పోసినప్పటికీ… పెద్ద గ్లాసులు వాడినప్పుడు సేల్స్ పెరుగుతున్నాయట. ఈ నేపథ్యంలో మందు ఎక్కువ తాగకుండా గ్లాసుల సైజును తగ్గించాల్సిన అవసరం ఉందని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు. గత 300 ఏళ్లలో వైన్ గ్లాసుల సైజు దాదాపు ఏడు సార్లు పెరిగిందని, ఇక 1990 నుంచి వీటి సైజు రెండింతలవుతూ వస్తోందని తెలిపారు. రెస్టారెంట్లలో గ్లాస్ సైజును 370 ఎంఎల్‌‌‌‌‌‌‌‌కు పెంచినప్పుడు వైన్ సేల్స్ 7.3% పెరిగాయని,  250 ఎంఎల్ గ్లాసుల్లో వైన్ సేల్స్ 9.6% తగ్గాయని చెప్పారు. మరోవైపు గ్లాసు సైజును 450 ఎంఎల్‌‌‌‌‌‌‌‌కు పెంచినా, 300 ఎంఎల్ గ్లాసులతో సర్వ్ చేసినప్పటితో పోలిస్తే తేడా ఏమీ లేదని వెల్లడించారు.