
- పదేండ్లు పాలమూరును బీఆర్ఎస్ పట్టించుకోలే: వంశీచంద్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఎంపీగా గెలిచి.. పుట్టిన గడ్డను కరువు నుంచి విముక్తి చేస్తానని కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయానికి మించి లోక్‌సభ ఎలక్షన్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కాంగ్రెస్ హైకమాండ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
తనకు అండగా నిలిచి, పాలమూరు అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 14కి పైగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ వంద రోజుల్లోనే అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నామని పేర్కొన్నారు.