హ్యాటాఫ్స్ మేడం: జోరువానలోనే వీర జవాన్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళి

హ్యాటాఫ్స్ మేడం: జోరువానలోనే వీర జవాన్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళి

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పిస్తుండగా..చల్లటి గాలులతో జోరువాన పడింది. వానలో తడుస్తూనే ఆమె కార్యక్రమాన్ని పూర్తిచేశారు. మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, సెల్యూట్ చేశారు. రాష్ట్రపతితో పాటు రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్,  సీడీఎస్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అమర్ ప్రీత్ సింగ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్  త్రిపాఠి ఉన్నారు.