ఇద్దరు స్టూడెంట్స్ సూసైడ్ ..మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఘటనలు

ఇద్దరు స్టూడెంట్స్ సూసైడ్ ..మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఘటనలు
  • మహబూబాబాద్ జిల్లా ఉప్పెరగూడెంలో ఒకరు..
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరొకరు..

వెలుగు, తొర్రూరు (పెద్దవంగర): ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. తొర్రూర్ మండలం ఉప్పెరగూడెం గ్రామానికి చెందిన గద్దల కొమురయ్య, -బుచ్చమ్మ దంపతుల మనువడు గద్దల బన్నీ(17), నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా రు. బన్నీ తల్లిదండ్రులు చనిపోగా బంధువులు వద్ద ఉంటున్నాడు. ఇటీవల ఉప్పెరగూడెం వచ్చిన బన్నీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయాడు.  సమాచారం అందడంతో ఎస్ఐ క్రాంతి కిరణ్ ఘటనా స్థలానికి వెళ్లి  డెడ్ బాడీనీ పోస్టుమార్టం కోసం వర్ధన్నపేట ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. 

నిశ్చితార్థం ఆగిపోవడంతో యువతి ..

గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం చీమలగూడెం గ్రామానికి చెందిన పీజీ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. గుండాల ఎస్ఐ తెలిపిన ప్రకారం.. ఆరెం గౌతమి( 22)కి కొద్ది రోజుల కింద నిశ్చితార్థం జరిగి ఆగిపోయింది. దీంతో అప్పటినుంచి మనస్తాపానికి గురైన ఆమె శుక్రవారం ఇంట్లో ఎవరూ లేనప్పుడు పురుగుల మందు తాగింది. అనంతరం ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు సర్కార్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ఇద్దరు జెండా ఎగరేసి డాక్టర్లు వెళ్లిపోయారు. డాక్టర్లు లేక సకాలంలో వైద్యం అందకపోవడంతోనే తమ కూతురు చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు విలపిస్తూ చెప్పారు.