
మీర్ పేట, వెలుగు: తండ్రి మందలించడతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మీర్ పేట పీఎస్పరిధిలో చోటుచేసుకుంది. నాదర్ గుల్ లోని విజయ లక్ష్మి కాలనీలో ఉండే నర్సింహ కొడుకు సంపత్ కుమార్(20).ఆదివారం నర్సింహ సంపత్‌ను ఓ విషయంలో మందలించాడు. దీంతో కోపంలో సంపత్ ఇంట్లోని యాసిడ్ తాగాడు. హాస్పిటల్చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యాదయ్య తెలిపారు.