
దర్శకుడు విజయ్ భాస్కర్ తన కొడుకు శ్రీకమల్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘జిలేబి’. గుంటూరు రామకృష్ణ నిర్మించారు. శివాని రాజశేఖర్ హీరోయిన్. తాజాగా మూవీ నుంచి ‘ఆకు పాకు’ అనే పాటని విడుదల చేశారు.
మణిశర్మ కంపోజ్ చేయగా.. రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్‌గా పాడాడు. ‘ఆకు పాకు ఇస్తరాకు.. ఆల్ సైడ్సు రోడ్డు బ్లాకు.. దారి తప్పి పోత ఉంది లైఫ్ ట్రాకు... లేడి లక్కు డోరు లాకు.. బిక్కు బిక్కు మైండు బ్లాకు.. మంట రేగి పోత ఉంది ఫ్రంట్ బ్యాక్.. సిట్యువేషన్ కన్ఫ్యూజన్ రో.. ఆపరేషన్ హై టెన్షన్ రో..’ అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. పాటలో హీరోహీరోయిన్స్ కంగారుగా పరుగులు తీస్తూ కనిపించారు. హిలేరియస్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్ ఇతర పాత్రలు పోషించారు.