- నాలుగో రోజూ విద్యార్థులు, టీచర్ల సందడి
రామచంద్రాపురం, వెలుగు: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు గాడియం ఇంటర్నేషనల్స్కూల్లో నిర్వహిస్తోన్న సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ఉత్సాహంగా కొనసాగుతోంది. నాలుగో రోజు గురువారం సైన్స్ ఫెయిర్‌ను చూసేందుకు విద్యార్థులు, టీచర్లు భారీగా తరలిరాగా సందడి నెలకొంది.
సంగారెడ్డి అడిషనల్కలెక్టర్ పాండు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ విద్యార్థుల ఎగ్జిబిట్లను పరిశీలించారు. స్పేస్ఆన్వీల్స్వెహికల్ ఆకట్టుకుంది. జన విజ్ఞాన వేదిక స్టాల్‌ను ఏర్పాటు చేసి మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకు చేసే ప్రయత్నాన్ని అధికారులు అభినందించారు.
విద్యార్థుల్లోని సృజనాత్మకతను పెంపొందించేందుకు సైన్స్ ఫెయిర్లు దోహదం చేస్తాయని అడిషనల్ కలెక్టర్ పాండు పేర్కొన్నారు. భవిష్యత్ప్రయోగాలకు బాటలు వేసే దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఫెయిర్ ముగింపు వేడుకలు జరుగుతాయని తెలిపారు.
