ఎస్సారెస్పీకి స్వల్ప వరద

ఎస్సారెస్పీకి స్వల్ప వరద
  • ఇయ్యాల నారాయణపూర్‌‌‌‌కు ఫ్లడ్ వాటర్    

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: శ్రీరాంసాగర్‌‌‌‌ ప్రాజెక్టుకు స్వల్ప వరద వస్తోంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో సోమవారం 2,604 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టులో 90.31 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 20.22 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అలాగే మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత నుంచి 6,700 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వస్తోంది. సమ్మక్క బ్యారేజీకి 1,200 క్యూసెక్కుల వరద వస్తోంది. కృష్ణా బేసిన్‌‌‌‌లో కర్నాటకలోని నారాయణపూర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌కు 5,717 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ రిజర్వాయర్‌‌‌‌ ఎగువ ప్రాంతంలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఇంకో రెండు రోజులు అక్కడ భారీ వర్షాలు పడే సూచన ఉంది. దీంతో మంగళవారం ఈ ప్రాజెక్టుకు భారీగా వరద నీళ్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రిజర్వాయర్‌‌‌‌లో 37.64 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీకి గాను 31.68 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. రెండు రోtజులు వరద కొనసాగితే పవర్‌‌‌‌ జనరేషన్‌‌‌‌ ద్వారా ఈ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. 9.66 టీఎంసీల కెపాసిటీ ఉన్న జూరాలలో ఇప్పటికే 8.07 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు 227 క్యూసెక్కుల వరద వస్తోంది. తుంగభద్ర డ్యాంకు 2,566 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వస్తోంది. ధవళేశ్వరం దిగువన కురిసిన వర్షాలతో ఈ 20 రోజుల్లో (జూన్‌‌‌‌ 1 నుంచి) బంగాళాఖాతంలోకి 2 టీఎంసీల నీళ్లు వెళ్లాయి.