కొత్తగా 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు జీవో జారీ

కొత్తగా 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు జీవో జారీ

హైదరాబాద్: వైద్య వృత్తి చేపట్టాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో  8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, అసిఫాబాద్, సిరిసిల్ల, జనగాం, వికారాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023– 24 విద్యా సంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభం కానున్ను ఈ కాలేజీల్లో  మొత్తం 1200 వరకు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కాగా... ప్రస్తుతం ఉన్న కరీంనగర్ లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని మెడికల్ కళాశాలగా అప్రూవల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయగా... ఆ ఉత్తర్వులను సీఎం కేసీఆర్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ అందుకున్నారు.

ఇక రాష్ట్రంలో కొత్తగా మొత్తం 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అందులో భాగంగా గతేడాది 8 వైద్య కళాశాలలు ఏర్పాటుకు జీవో జారీ చేసింది. మంచిర్యాల, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, జగిత్యాల, రామగుండం, వనపర్తిలో కొత్తగా కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.