ఎంసెట్ సిలబస్ తగ్గింపు

V6 Velugu Posted on Feb 06, 2021

హైదరాబాద్, వెలుగుకరోనా నేపథ్యంలో టీఎస్ ఎంసెట్ సిలబస్​ను  రాష్ట్ర సర్కారు తగ్గించింది. ఎంసెట్​లో ఇంటర్ సెకండియర్​ నుంచి  70 శాతం, ఫస్టియర్ ​నుంచి 100 శాతం సిలబస్​ ఉంటుందని ప్రకటించింది. జూన్​ మూడోవారంలో ఎంసెట్​ నిర్వహించే అవకాశం ఉంది. శుక్రవారం విద్యాశాఖ స్పెషల్ చీఫ్​సెక్రటరీ చిత్రారాంచంద్రన్, హయ్యర్​ ఎడ్యుకేషన్​ కౌన్సిల్​ చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్, కౌన్సిల్ సెక్రెటరీ శ్రీనివాసరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంసెట్ సిలబస్, క్వశ్చన్ పేపర్, ఎగ్జామ్ నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఎంసెట్​లో ఇంటర్ మార్కుల వెయిటేజీని ఎప్పటిలాగే కొనసాగించాలని నిర్ణయించారు. కరోనా కారణంగా సెప్టెంబర్​ఫస్ట్​ నుంచి ఇంటర్ సెకండియర్ ​ఆన్​లైన్ పాఠాలు కొనసాగుతుండగా.. ఫిజికల్ క్లాసులు ఫిబ్రవరి ఫస్ట్​నుంచి స్టార్ట్ అయ్యాయి. అయితే ఆన్​లైన్ పాఠాలు స్టూడెంట్స్ కు పెద్దగా అర్థం కాలేదని ఆఫీసర్లే చెప్తున్నారు. దీంతో ఎంసెట్​క్వశ్చన్​పేపర్​లో మార్పులు తీసుకురావాలని, ఎంసెట్ కన్వీనర్ నియామకం పూర్తయ్యాక, క్వశ్చన్ పేపర్​ఎలా ఉండాలనే దానిపై కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయించారు.

స్లాబ్స్ ​ఆధారంగా డేట్లు: తుమ్మల పాపిరెడ్డి

మే 13 వరకు ఇంటర్  మెయిన్ సబ్జెక్టులకు పరీక్షలు పూర్తవుతాయని, దీంతో జూన్14 తర్వాత ఎప్పుడైనా ఎంసెట్ నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని హయ్యర్​ ఎడ్యుకేషన్​ కౌన్సిల్​ చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. ఆన్ లైన్​ ఎగ్జామ్​ కావడంతో టీసీఎస్ స్లాబ్స్ ​ఆధారంగా డేట్లు ఖరారు చేస్తామన్నారు. వారం పది రోజుల్లో అన్ని సెట్ల కన్వీనర్లను నియమిస్తామని వెల్లడించారు. ఎంసెట్ సిలబస్​ను శుక్రవారం రాత్రి విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

Tagged TS, EAMCET, state governmen, syllabus

Latest Videos

Subscribe Now

More News