రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.  ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్ లో 7.5 సెంటీమీటర్ల భారీ వర్షాపాతం నమోదు అయ్యింది.  పెద్దపల్లిలోని కనుకులలో 7.4  శాతం, పెద్దపల్లిలోని శ్రీరాంపూర్ లో 6.7 సెంటీమీటర్ల భారీ వర్షాలు కురిసాయి. జయశంకర్ భూపాలపల్లి సర్వాయిపేటలో 6.3 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదు కాగ, నిర్మల్ జిల్లాలోని పెంబిలో 6.2 శాతం, పెద్దపల్లి రంగంపల్లిలో 6.2,  కరీంనగర్ ఆమకొండలో 6.1, పెద్దపల్లిలోని మూత రామ వద్ద 6 సెంటీమీటర్లు, పెద్దపల్లిలోని సుగులంపల్లిలో 5.8 సెంటీమీటర్లు, కరీంనగర్లోని వెదురుగట్టులో 5.7 సెంటి మీటర్ల వర్షాపాతం నమోదు అయ్యింది. 

ఇక ములుగులోని వెలుతుర్లపల్లి లో 5.7, కరీంనగర్లోని తంగులలో 5.6, కరీంనగర్లోని గుండీలో 5.3, పెద్దపల్లిలోని  జూలపల్లి లో 5.2, పెద్దపల్లిలోని కాల్వంచర్ల 5.2, మంచిర్యాలలోని వెలగనూరులో 5 సెంటీమీటర్లు, జగిత్యాలలోని అల్లిపూర్ లో 4.9 ,జయశంకర్ లోని రేగుల గూడెంలో 4.9, పెద్దపల్లిలోని కమంపూర్ లో 4.9 సెంటీమీటర్ల మోస్తరు వర్షాలు కురిశాయి.  సిటీలోను తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మలక్ పేట, ఖైరతాబాద్, గోషామల, ఎల్బీనగర్, కూకట్ పల్లి ,అంబర్ పేట్, జూబ్లీహిల్స, చందానగర్, బేగంపేట్ ఏరియాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిస్తున్నాయి. ముషీరాబాద్, మూసాపేట, మెహదీపట్నం, గోషామహల్, ఉప్పల్ ఏరియాలో తేలికపాటి జల్లులు కురిశాయి.